![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -659 లో...... లిక్కర్ కమలేష్ చూపించిన ఆధారంలో అనామికనే నేరస్తురాలని తెలిసిపోతుంది. అనామికనే సామంత్ ని హత్య చేసినట్లు జడ్జ్ ముందు ఒప్పుకుంటుంది. దాంతో పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనామికకి విధిస్తారు. ఏ తప్పు చెయ్యలేదని రాజ్ ని వదిలిపెడతారు.
రాజ్ ని చూసి కావ్య అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే అనామికని తీసుకొని వెళ్తుంటారు కళ్యాణ్ , కావ్య ఇద్దరు అనామికని తిడతారు. మిమ్మల్ని ఎప్పటికి వదిలిపెట్టనంటూ అనామిక శపథం చేసి వెళ్తుంది. అప్పుడే రాజ్ కి ఒక అమ్మాయి కన్పిస్తుంది. రాజ్ తనని టెన్షన్ పడుతూ ఎక్కడ ఉందని వెతుకుతాడు. ఏమైందని కావ్య అడుగగా.. ఏం లేదని రాజ్ అంటాడు. అందరు కలిసి ఇంటికి వస్తారు. దుగ్గిరాల కుటుంబం రాజ్ కి హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. జైలు కీ వెళ్ళాల్సినోడు ఇంటికి వచ్చాడు. అంతేగా అందుకు హారతి ఇవ్వడం ఏంటని రుద్రాణి అంటుంటే.. ప్రకాష్ తనకి కౌంటర్ ఇస్తాడు. ఆస్తులు తిరిగి వచ్చాయి. రాజ్ ఇంటికి వచ్చాడు. ఇక మనం ఆస్తులు ఎలా వస్తాయని రాహుల్ , రుద్రాణిలు డిస్సపాయింట్ అవుతారు.
ఆ తర్వాత అందరు హ్యాపీగా ఉండడంతో అన్నయ్యపై నేనొక కవిత చెప్తానని కళ్యాణ్ కవిత చెప్తాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి.. ఇక ముందు కూడ ప్రాబ్లమ్ ఏ రూపంలో వస్తాయో ఎవరికి తెలుసని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ని ప్రేమించిన అమ్మాయి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి రాజ్ ఫోటో చూపిస్తుంది. వెళ్లి తన పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించాలని వాళ్ళు అనగానే ఒప్పించాల్సింది పేరెంట్స్ ని కాదు రాజ్ భార్యని అనగానే వాళ్ళు షాక్ అవుతారు. కావ్యని రాజ్ దగ్గరికి తీసుకొని.. నిన్ను, నన్ను ఎవరు దూరం చేసినా మళ్ళీ నన్ను దక్కించుకుంటావని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |